ఆనతియ్యవే మాతో నానతి మన్ననలెల్లా
(॥పల్లవి॥)
ఆనతియ్యవే మాతో నానతి మన్ననలెల్లా
పూని సంతోసాన నిన్నుఁ బొగడేము గాని
(॥ఆన॥)
జల జలఁ జెమరించె జాజుకొనఁ బులకించె
తలఁపులోనివలపు దాఁచనేఁటికే
కళలు మోమున రేఁగె కానవచ్చెఁదమము
చెలుల మింతే మాతో సిగ్గువడ నేఁటికే
(॥ఆన॥)
కొప్పు గడువెడఁజారె గురుతు లాడాడ నిండె
చిప్పిల నేఁడే పరాకుసేయనేఁటికే
దప్పిదేరెఁ బెదవుల దగదొట్టె నూర్పుల
యెప్పుడును నీవారమే యిఁక నేలే మఱఁగు
(॥ఆన॥)
కన్నుల నిద్దుర దేరె గందపు బేంట్లు రాలె
సన్నలా చాయలా వట్టిసట లేఁటికే
యిన్నిటా శ్రీవేంకటేశుఁ డిదివో నిన్నుఁ గూడె
యెన్న నూడిగవువార మిఁక నేసాలేఁటికే
(||pallavi||)
ānadiyyave mādo nānadi mannanalĕllā
pūni saṁtosāna ninnum̐ bŏgaḍemu gāni
(||āna||)
jala jalam̐ jĕmariṁchĕ jājugŏnam̐ bulagiṁchĕ
talam̐pulonivalabu dām̐sanem̐ṭige
kaḽalu momuna rem̐gĕ kānavachchĕm̐damamu
sĕlula miṁte mādo sigguvaḍa nem̐ṭige
(||āna||)
kŏppu gaḍuvĕḍam̐jārĕ gurudu lāḍāḍa niṁḍĕ
sippila nem̐ḍe parāguseyanem̐ṭige
dappiderĕm̐ bĕdavula dagadŏṭṭĕ nūrbula
yĕppuḍunu nīvārame yim̐ka nele maṟam̐gu
(||āna||)
kannula niddura derĕ gaṁdabu beṁṭlu rālĕ
sannalā sāyalā vaṭṭisaḍa lem̐ṭige
yinniḍā śhrīveṁkaḍeśhum̐ ḍidivo ninnum̐ gūḍĕ
yĕnna nūḍigavuvāra mim̐ka nesālem̐ṭige