ఆనతిచ్చితే నేమాయ నందుకేమే
(॥పల్లవి॥)
ఆనతిచ్చితే నేమాయ నందుకేమే
వూని నేమెంతడిగినా నూరకుండేవేమే
(॥ఆన॥)
చక్కఁగా నీయాతనిసందివావి యెట్టిదంటే
చెక్కుచేతితో సిగ్గున జెందేవేమే
పిక్కటిల్లి మీ మేనుల పెంజెమట గారీనంటే
తక్కక ఇంతటిలోనే తలవంచేవేమే
(॥ఆన॥)
గట్టిగా నీతో నాతనికతలు నేఁ జెప్పఁగాను
గుట్టుతో నుందానవు వూఁకొనవేమే
జట్టిగా మీముందరను సరివిడేలు వెట్టితే
నట్టనడుమ నూరకె నవ్వు నవ్వేవేమే
(॥ఆన॥)
తెలిసి చెలులమెల్లాఁ దెరమరఁగు వేసితే
చులుకఁగాఁ బెనఁగుచు సొలసేవేమే
యెలమి శ్రీవేంకటేశుఁ డింతలోనే నిన్నుఁ గూడె
చలివాయఁ బొగడితే సారె మెచ్చేవేమే
(||pallavi||)
ānadichchide nemāya naṁdugeme
vūni nemĕṁtaḍiginā nūraguṁḍeveme
(||āna||)
sakkam̐gā nīyādanisaṁdivāvi yĕṭṭidaṁṭe
sĕkkusedido sigguna jĕṁdeveme
pikkaḍilli mī menula pĕṁjĕmaḍa gārīnaṁṭe
takkaga iṁtaḍilone talavaṁcheveme
(||āna||)
gaṭṭigā nīdo nādanigadalu nem̐ jĕppam̐gānu
guṭṭudo nuṁdānavu vūm̐kŏnaveme
jaṭṭigā mīmuṁdaranu sariviḍelu vĕṭṭide
naṭṭanaḍuma nūragĕ navvu navveveme
(||āna||)
tĕlisi sĕlulamĕllām̐ dĕramaram̐gu veside
sulugam̐gām̐ bĕnam̐gusu sŏlaseveme
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalone ninnum̐ gūḍĕ
salivāyam̐ bŏgaḍide sārĕ mĕchcheveme