Aanadeevayyaa maagu namdugu nemaayanu

ఆనతీవయ్యా మాకు నందుకు నేమాయను
Language

(॥పల్లవి॥)
ఆనతీవయ్యా మాకు నందుకు నేమాయను
పూని తగవుదిద్దేము పొలఁతుల మిపుడు

(॥ఆన॥)
సొలసిసొలసి చూచి చొప్పలెత్తి నీకుఁ జూపి
చెలి నీకు విన్నపాలుసేసీ నిదె
తలఁపులో బెట్టుకొని దాఁచిదాఁచి నవ్వేవు
కలదా నీవోళ్లఁ గొంత కపట మేమైనను

(॥ఆన॥)
తారుకాణలెల్లఁ జేసి దయవుట్ట నీకు మొక్కి
కూరిములు చల్లి చల్లి కొసరీ నిన్ను
వూరకె తలవంచేవు వొడ్డించుకొనే వప్పటి
నేరము లేమైనాను నీవల్లఁ గలవా

(॥ఆన॥)
నిన్నే వొడఁబరచి నీకన్నిబుద్దులూఁ జెప్పి
కన్నె యలమేలుమంగ కాఁగిలించీని
యిన్నిటా శ్రీవేంకటేశ యియ్యకొంటివి నీవును
వున్నవా నీవల్లఁ గొన్ని వుదుటుఁచేతలు

(||pallavi||)
ānadīvayyā māgu naṁdugu nemāyanu
pūni tagavudiddemu pŏlam̐tula mibuḍu

(||āna||)
sŏlasisŏlasi sūsi sŏppalĕtti nīgum̐ jūbi
sĕli nīgu vinnabālusesī nidĕ
talam̐pulo bĕṭṭugŏni dām̐sidām̐si navvevu
kaladā nīvoḽlam̐ gŏṁta kabaḍa memainanu

(||āna||)
tārugāṇalĕllam̐ jesi dayavuṭṭa nīgu mŏkki
kūrimulu salli salli kŏsarī ninnu
vūragĕ talavaṁchevu vŏḍḍiṁchugŏne vappaḍi
neramu lemainānu nīvallam̐ galavā

(||āna||)
ninne vŏḍam̐barasi nīgannibuddulūm̐ jĕppi
kannĕ yalamelumaṁga kām̐giliṁchīni
yinniḍā śhrīveṁkaḍeśha yiyyagŏṁṭivi nīvunu
vunnavā nīvallam̐ gŏnni vuduḍum̐sedalu