ఆన తియ్యవయ్యా మాకు నామేలు వినేముగాని
(॥పల్లవి॥)
ఆన తియ్యవయ్యా మాకు నామేలు వినేముగాని
కోమలికిఁ బొంతనాలు గూడెనా నీకు
(॥ఆన॥)
చలముగొని యాపెను సారెసారెఁ జూచేవు
మలసి నీకుఁ బెండ్లాడ మనసయ్యీనా
చెలరేఁగి యప్పటిని చేయి మీఁదవేసేవు
యెలమితో వారివారు ఇచ్చిరా నీకు
(॥ఆన॥)
తీపులమోవినిండ తేనియలు జొబ్బిలీవి
ఆపెకు నీకును మాట లందెనా నేఁడు
కాఁపురము సేసేనంటా కాచుకొనివున్నాఁడవు
ఆపాటి చుట్టరికమ లాయనా నీకు
(॥ఆన॥)
పానుపుపై నాపెచేతఁ బాదా లొత్తించు కొనేవు
అనుకొని బువ్వము పొత్తబ్బెనా మీకు
పూని శ్రీవేంకటేశ్వర పొంచి నన్ను నేలితివి
మేనరికా లిద్దరికి మెరసెనా ఇపుడు
(||pallavi||)
āna tiyyavayyā māgu nāmelu vinemugāni
komaligim̐ bŏṁtanālu gūḍĕnā nīgu
(||āna||)
salamugŏni yābĕnu sārĕsārĕm̐ jūsevu
malasi nīgum̐ bĕṁḍlāḍa manasayyīnā
sĕlarem̐gi yappaḍini seyi mīm̐davesevu
yĕlamido vārivāru ichchirā nīgu
(||āna||)
tībulamoviniṁḍa teniyalu jŏbbilīvi
ābĕgu nīgunu māḍa laṁdĕnā nem̐ḍu
kām̐puramu sesenaṁṭā kāsugŏnivunnām̐ḍavu
ābāḍi suṭṭarigama lāyanā nīgu
(||āna||)
pānububai nābĕsedam̐ bādā lŏttiṁchu kŏnevu
anugŏni buvvamu pŏttabbĕnā mīgu
pūni śhrīveṁkaḍeśhvara pŏṁchi nannu nelidivi
menarigā liddarigi mĕrasĕnā ibuḍu