Aana summee yimka neegu naubhalesha

ఆన సుమ్మీ యిఁక నీకు నౌభళేశ
Language

(॥పల్లవి॥)
ఆన సుమ్మీ యిఁక నీకు నౌభళేశ
మోనమేల మాఁటలాడు మొక్కే నౌభళేశ

(॥ఆన॥)
కాయమెల్లఁ జెమరించె కడుబడలితి విదె
ఆయనాయఁ జాలుఁ గోప మౌభళేశ
ఆయులు గరఁగించి అండకు వచ్చితి నేను
మాయలేల నవ్వరాదా మాతో నౌభళేశ

(॥ఆన॥)
మెఱుఁగుమోవి వాడె మిక్కిలి బునకొట్టేవు
అఱిముఱి మఱవేల యౌభళేశ
గుఱిగా నీకొనగోరు గుబ్బలు సోఁకించితి నీ -
మఱపులు చెల్లవిఁక మాను మౌభళేశ

(॥ఆన॥)
కలసితి మిద్దరము కన్నులనె కెంపుదేరె
అలయకు మిఁక నీవు ఔభళేశ
తలపోఁతలు మనకు తారుకాణ లివె వచ్చె
బలిమి శ్రీవేంకటాద్రిపతి యౌభళేశ

(||pallavi||)
āna summī yim̐ka nīgu naubhaḽeśha
monamela mām̐ṭalāḍu mŏkke naubhaḽeśha

(||āna||)
kāyamĕllam̐ jĕmariṁchĕ kaḍubaḍalidi vidĕ
āyanāyam̐ jālum̐ goba maubhaḽeśha
āyulu garam̐giṁchi aṁḍagu vachchidi nenu
māyalela navvarādā mādo naubhaḽeśha

(||āna||)
mĕṟum̐gumovi vāḍĕ mikkili bunagŏṭṭevu
aṟimuṟi maṟavela yaubhaḽeśha
guṟigā nīgŏnagoru gubbalu som̐kiṁchidi nī -
maṟabulu sĕllavim̐ka mānu maubhaḽeśha

(||āna||)
kalasidi middaramu kannulanĕ kĕṁpuderĕ
alayagu mim̐ka nīvu aubhaḽeśha
talabom̐talu managu tārugāṇa livĕ vachchĕ
balimi śhrīveṁkaḍādribadi yaubhaḽeśha