ఆఁటది గూళయైతే నందేమున్నది
(॥పల్లవి॥)
ఆఁటది గూళయైతే నందేమున్నది
మాటుసేసుకొని ఆకు మడిచిచ్చేవేమే
(॥ఆట॥)
బత్తిసేసి నావద్ద పాయ కితఁ డుండఁగాను
పొత్తుల మాటాడి నీవు పొదిగేవేమే
గుత్తపుగుబ్బల నన్నుఁ గుచ్చి కాఁగిలించఁగాను
హత్తి వూడిగాలు సేసే వప్పటి నీ వదేమే
(॥ఆట॥)
పాడితోఁ బగడసాలపందే లాతఁ డొడ్డఁగా
ఆడుమనుచుఁ బాసిక లందిచ్చేవేమే
వీడెము నా చేతికిచ్చి విందుల మో వియ్యఁగాను
నోడలఁ బెట్టి పతికి నోరూరే వేమే
(॥ఆట॥)
శ్రీవేంకటేశుఁడు నన్ను చిత్తగించి కూడఁగాను
వావులు చెప్పేవు సారె వాకిట నేమే
ఆవేళ దయసేసి ఆతఁడు నిన్నేలితేను
దేవులవై వచ్చి నాతో దీకొనేవేమే
(||pallavi||)
ām̐ṭadi gūḽayaide naṁdemunnadi
māḍusesugŏni āgu maḍisichcheveme
(||āḍa||)
battisesi nāvadda pāya kidam̐ ḍuṁḍam̐gānu
pŏttula māḍāḍi nīvu pŏdigeveme
guttabugubbala nannum̐ guchchi kām̐giliṁcham̐gānu
hatti vūḍigālu sese vappaḍi nī vademe
(||āḍa||)
pāḍidom̐ bagaḍasālabaṁde lādam̐ ḍŏḍḍam̐gā
āḍumanusum̐ bāsiga laṁdichcheveme
vīḍĕmu nā sedigichchi viṁdula mo viyyam̐gānu
noḍalam̐ bĕṭṭi padigi norūre veme
(||āḍa||)
śhrīveṁkaḍeśhum̐ḍu nannu sittagiṁchi kūḍam̐gānu
vāvulu sĕppevu sārĕ vāgiḍa neme
āveḽa dayasesi ādam̐ḍu ninnelidenu
devulavai vachchi nādo dīgŏneveme