Aamtadaanim gamtemjaalu atte lolumda vauduvu

ఆఁటదానిఁ గంటేఁజాలు అట్టె లోలుఁడ వౌదువు
Language

(॥పల్లవి॥)
ఆఁటదానిఁ గంటేఁజాలు అట్టె లోలుఁడ వౌదువు
మాఁటల నాపెతోఁ గూడ మరచివచ్చితివా

(॥ఆఁట॥)
తతితోడ నీ విప్పుడు తన ఇంటికి రావంటా
సతి నిన్నుఁ గొసరీని సముకానను
మితిలేనివాడలెల్లా మెట్టివచ్చితి విందాఁకా
వెతదీర నాడకుఁబో వేళ లేదాయనా

(॥ఆఁట॥)
సారెఁ దనతో సరసములాడవైతివంటా
వూరకె తప్పులెంచీ నీవొద్దనే వుండి
నేరుపుతో కతలెల్లా నేరిచినవాఁడవు
యీరీతి నీపెవలపు యెరఁగలేవైతివా

(॥ఆఁట॥)
అన్నిటాను తన్నుఁగూడి ఆయా లంటవైతివంటా
కన్నుల సన్నలు చేసీ కాఁగిటిలోను
ఇన్నిటా శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
తిన్నఁగా నాపెవలపు తెలుసుకోవైతివా

(||pallavi||)
ām̐ṭadānim̐ gaṁṭem̐jālu aṭṭĕ lolum̐ḍa vauduvu
mām̐ṭala nābĕdom̐ gūḍa marasivachchidivā

(||ām̐ṭa||)
tadidoḍa nī vippuḍu tana iṁṭigi rāvaṁṭā
sadi ninnum̐ gŏsarīni samugānanu
midilenivāḍalĕllā mĕṭṭivachchidi viṁdām̐kā
vĕdadīra nāḍagum̐bo veḽa ledāyanā

(||ām̐ṭa||)
sārĕm̐ danado sarasamulāḍavaidivaṁṭā
vūragĕ tappulĕṁchī nīvŏddane vuṁḍi
nerubudo kadalĕllā nerisinavām̐ḍavu
yīrīdi nībĕvalabu yĕram̐galevaidivā

(||ām̐ṭa||)
anniḍānu tannum̐gūḍi āyā laṁṭavaidivaṁṭā
kannula sannalu sesī kām̐giḍilonu
inniḍā śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
tinnam̐gā nābĕvalabu tĕlusugovaidivā