ఆఁటదాని కోపవా అంతేసి నీవు
(॥పల్లవి॥)
ఆఁటదాని కోపవా అంతేసి నీవు
యీటువెట్టి సలిగె నీ విచ్చినదే కాదా
(॥ఆఁట॥)
చలములేని మగువ సాదించ నోపునా
వలెనని యాపె నీతో వాదించీఁగాక
బలిమి లేకుంటేను పంతమాడనోపునా
కలుగఁగానే నిన్ను గద్దించెఁగాక
(॥ఆఁట॥)
నేరుపులేని మగువ నీతో పొందుసేసునా
చేరి యందుకొరకె చెనకీఁగాక
బీరములేని యాపె పెనఁగఁగ నోవునా
దీరత సాదజముగాన దీకొనెఁగాక
(॥ఆఁట॥)
ననుపులేని మగువ నవ్వ నీతో నోపునా
వొనరఁగానే చన్నుల నొత్తీఁగాక
యెనసితివి శ్రీవేంకటేశ నన్ను నింతలోనె
వెనక కిందుకే యాపె విడె మిచ్చెఁగాక
(||pallavi||)
ām̐ṭadāni kobavā aṁtesi nīvu
yīḍuvĕṭṭi saligĕ nī vichchinade kādā
(||ām̐ṭa||)
salamuleni maguva sādiṁcha nobunā
valĕnani yābĕ nīdo vādiṁchīm̐gāga
balimi leguṁṭenu paṁtamāḍanobunā
kalugam̐gāne ninnu gaddiṁchĕm̐gāga
(||ām̐ṭa||)
nerubuleni maguva nīdo pŏṁdusesunā
seri yaṁdugŏragĕ sĕnagīm̐gāga
bīramuleni yābĕ pĕnam̐gam̐ga novunā
dīrada sādajamugāna dīgŏnĕm̐gāga
(||ām̐ṭa||)
nanubuleni maguva navva nīdo nobunā
vŏnaram̐gāne sannula nŏttīm̐gāga
yĕnasidivi śhrīveṁkaḍeśha nannu niṁtalonĕ
vĕnaga kiṁduge yābĕ viḍĕ michchĕm̐gāga