Aamtadaani kimtagaddaa agadu sesemgaaga

ఆఁటదాని కింతగద్దా అగడు సేసెఁగాక
Language

(॥పల్లవి॥)
ఆఁటదాని కింతగద్దా అగడు సేసెఁగాక
జూటరి దీని విద్యలు చూడరమ్మా సతులు

(॥ఆఁట॥)
చిగురుఁ బెదవిమీఁద చిన్నిముద్దుమాఁట లాడీ
మగనితో నించుకంతా మరఁగలేక
తెగనివలపు చల్లి తీగె నవ్వులు నవ్వీ
సొగిసే దీవి వుదుటు చూడఁ గొత్తలాయను

(॥ఆఁట॥)
తమ్మికన్నులు దెరచి తళుఁకుఁ జూపులఁ జూచీ
కమ్మటఁ బతి యెదుట గర్వమునను
సొమ్మలెల్లాఁ జూపుకొంటా జోలి మొక్కులు మొక్కీ
యెమ్మెలదీనివేసాల కేమందు నేను

(॥ఆఁట॥)
కావరపు గుబ్బలు సోఁకఁగ సేవలెల్లాఁజేసీ
శ్రీవేంకటేశుఁ డెదుట సిగ్గువడక
వావితో నన్నితఁ డేలె వట్టిసన్నలు తాఁజేసీ
భావించి దీని గజరు పచ్చిఁ దోచె నిపుడు

(||pallavi||)
ām̐ṭadāni kiṁtagaddā agaḍu sesĕm̐gāga
jūḍari dīni vidyalu sūḍarammā sadulu

(||ām̐ṭa||)
sigurum̐ bĕdavimīm̐da sinnimuddumām̐ṭa lāḍī
maganido niṁchugaṁtā maram̐galega
tĕganivalabu salli tīgĕ navvulu navvī
sŏgise dīvi vuduḍu sūḍam̐ gŏttalāyanu

(||ām̐ṭa||)
tammigannulu dĕrasi taḽum̐kum̐ jūbulam̐ jūsī
kammaḍam̐ badi yĕduḍa garvamunanu
sŏmmalĕllām̐ jūbugŏṁṭā joli mŏkkulu mŏkkī
yĕmmĕladīnivesāla kemaṁdu nenu

(||ām̐ṭa||)
kāvarabu gubbalu som̐kam̐ga sevalĕllām̐jesī
śhrīveṁkaḍeśhum̐ ḍĕduḍa sigguvaḍaga
vāvido nannidam̐ ḍelĕ vaṭṭisannalu tām̐jesī
bhāviṁchi dīni gajaru pachchim̐ dosĕ nibuḍu