Aamtadaani kichchagame yamarumgaaga

ఆఁటదాని కిచ్చకమే యమరుఁగాక
Language

(॥పల్లవి॥)
ఆఁటదాని కిచ్చకమే యమరుఁగాక
చీటికిమాటికి ఱట్టుసేయఁగవలెనా

(॥ఆట॥)
రాయడించనేమిటికి రమణునియెడకును
సేయఁగలవిన్నపాలు చేసుకోరాదా
చాయగా నయము చూపి సాదించుకొనేమేలు
ఆయాలు మోవనాడితే నది సంగతౌనా

(॥ఆట॥)
చనవుగలదంటాను జంకించనేమిటికి
మనసురా సేవసేసి మరువరాదా
ననుపుగా మోవి యిచ్చి నాటించుకొనేవలపు
పెనఁగి రచ్చఁబెట్టితే ప్రియములైవుండునా

(॥ఆట॥)
బలిమికత్తెనంటాను పదరఁగ నేమిటికి
యెలమి నురమెక్కితి వెనయరాదా
అలమేల్మంగవు నీవు ఆతఁడు శ్రీవేంకటేశుఁ-
డలయించితే రతు లావటమైవుండునా

(||pallavi||)
ām̐ṭadāni kichchagame yamarum̐gāga
sīḍigimāḍigi ṟaṭṭuseyam̐gavalĕnā

(||āḍa||)
rāyaḍiṁchanemiḍigi ramaṇuniyĕḍagunu
seyam̐galavinnabālu sesugorādā
sāyagā nayamu sūbi sādiṁchugŏnemelu
āyālu movanāḍide nadi saṁgadaunā

(||āḍa||)
sanavugaladaṁṭānu jaṁkiṁchanemiḍigi
manasurā sevasesi maruvarādā
nanubugā movi yichchi nāḍiṁchugŏnevalabu
pĕnam̐gi rachcham̐bĕṭṭide priyamulaivuṁḍunā

(||āḍa||)
balimigattĕnaṁṭānu padaram̐ga nemiḍigi
yĕlami nuramĕkkidi vĕnayarādā
alamelmaṁgavu nīvu ādam̐ḍu śhrīveṁkaḍeśhum̐-
ḍalayiṁchide radu lāvaḍamaivuṁḍunā