ఆఁడువారి నీ వింత ఆగడాలు సేతురా
(॥పల్లవి॥)
ఆఁడువారి నీ వింత ఆగడాలు సేతురా
పోఁడిమిఁ జెమటఁ దోగె పొంచి పయ్యదెల్లాను
(॥ఆఁడు॥)
కొప్పువెట్టుకొనఁగాను కొమ్మకరమూలములు
తప్పకచూచి నీ వంతలో నవ్వంగా
చిప్పిలుసిగ్గున నాకె చేతులదుముకొంటేను
ముప్పిరిగొని మోముపై ముంచుకొనె నెరులు
(॥ఆఁడు॥)
కోక గట్టుకొనఁగానుకొమ్మెరుఁగైనతొడలు
జోకలుగా నీవట్టె చూచి నవ్వంగా
కాకరిసిగ్గునను మో కారించుక కూచుంటే
ఆకెమొల నూలిగంట లట్టె కుప్పవడెను
(॥ఆఁడు॥)
హారములు వెట్టుకోఁగా నందపుచన్నులు చూచి
నేరిచి శ్రీవేంకటేశనీవు నవ్వంగా
ఆరీతి సిగ్గున నిన్ను నట్టె కాఁగిలించుకొంటే
కూరిమితోఁ బులకలుకోరి జాజుకొనెను
(||pallavi||)
ām̐ḍuvāri nī viṁta āgaḍālu sedurā
pom̐ḍimim̐ jĕmaḍam̐ dogĕ pŏṁchi payyadĕllānu
(||ām̐ḍu||)
kŏppuvĕṭṭugŏnam̐gānu kŏmmagaramūlamulu
tappagasūsi nī vaṁtalo navvaṁgā
sippilusigguna nāgĕ seduladumugŏṁṭenu
muppirigŏni momubai muṁchugŏnĕ nĕrulu
(||ām̐ḍu||)
koga gaṭṭugŏnam̐gānugŏmmĕrum̐gainadŏḍalu
jogalugā nīvaṭṭĕ sūsi navvaṁgā
kāgarisiggunanu mo kāriṁchuga kūsuṁṭe
āgĕmŏla nūligaṁṭa laṭṭĕ kuppavaḍĕnu
(||ām̐ḍu||)
hāramulu vĕṭṭugom̐gā naṁdabusannulu sūsi
nerisi śhrīveṁkaḍeśhanīvu navvaṁgā
ārīdi sigguna ninnu naṭṭĕ kām̐giliṁchugŏṁṭe
kūrimidom̐ bulagalugori jājugŏnĕnu