Aalimagani jaadalu amdarigi niviye

ఆలిమగని జాడలు అందరికి నివియే
Language

(॥పల్లవి॥)
ఆలిమగని జాడలు అందరికి నివియే
మేలుమీఁదుగా విభుని మెప్పించవే నీవు

(॥ఆలి॥)
వింత లేక మెలఁగితే వేడుక నెరపవలె
సంతోసించితేను మెచ్చఁగవలెను
మంతనానకు లోనైతే మరిగియుండఁగవలె
పంతము లాడఁగరాదు పతితోడఁ జెలికి

(॥ఆలి॥)
ననుపు గలిగితేను నవ్వులు నవ్వఁగవలె
మనసు లెనసితే సమ్మతించవలె
వినయాలు నేరిచితే వేమారు వేఁడుకోవలె
పెనఁగులాడఁగరాదు ప్రియునితో సతికి

(॥ఆలి॥)
వావు లేకములైతే వడిఁ బొందుసేయవలె
దేవులైతేఁ దనబత్తి దెలుపవలె
శ్రీవేంకటేశుఁ డేలితే సిగ్గులు మానఁగవలె
కావరించి మీరరాదు కాంతునితో నింతికి

(||pallavi||)
ālimagani jāḍalu aṁdarigi niviye
melumīm̐dugā vibhuni mĕppiṁchave nīvu

(||āli||)
viṁta lega mĕlam̐gide veḍuga nĕrabavalĕ
saṁtosiṁchidenu mĕchcham̐gavalĕnu
maṁtanānagu lonaide marigiyuṁḍam̐gavalĕ
paṁtamu lāḍam̐garādu padidoḍam̐ jĕligi

(||āli||)
nanubu galigidenu navvulu navvam̐gavalĕ
manasu lĕnaside sammadiṁchavalĕ
vinayālu neriside vemāru vem̐ḍugovalĕ
pĕnam̐gulāḍam̐garādu priyunido sadigi

(||āli||)
vāvu legamulaide vaḍim̐ bŏṁduseyavalĕ
devulaidem̐ danabatti dĕlubavalĕ
śhrīveṁkaḍeśhum̐ ḍelide siggulu mānam̐gavalĕ
kāvariṁchi mīrarādu kāṁtunido niṁtigi