Aalayaana haaradilo aakhari sidimamtalalo

ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
Year
Language

పల్లవి:

ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం

ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం
ప్రేమ అనే పదాన వున్నది ఆరని అగ్ని కణం
దీపాన్ని చూపెడుతుందో? తాపాన బలిపెడుతుందో?
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఆ ఆ ఆ ఆ
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆ ఆ ఆ ఆ

ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం

చరణం 1:

ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా..
గుండె బావిలో వున్న ఆశ తడి ఆవిరి అవుతున్నా
ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా
ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా
నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం
ఎదర వుంది నడిరేయన్నది ఈ సంధ్యా సమయం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హౄదయం

ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం

చరణం 2:

సూర్యబింబమే అస్తమించనిదే మేలుకోని కల కోసం
కళ్ళు మూసుకుని కలవరించెనే కంటిపాప పాపం
ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసియైనా
రేయి చాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా
పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచేనా
కంటి పాప కల అడిగిందని నిదురించే నయనం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం

ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం
ప్రేమ అనే పదాన వున్నదీ అరని అగ్ని కణం
దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఆ ఆ ఆ ఆ .
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం ఆ ఆ ఆ ఆ..

pallavi:

ālayāna hāradilo ākhari sidimaṁṭalalo
rĕṁḍiḍilo nijānigunnadi ŏgaḍe agni guṇaṁ

ālayāna hāradilo ākhari sidimaṁṭalalo
rĕṁḍiḍilo nijānigunnadi ŏgaḍe agni guṇaṁ
prema ane padāna vunnadi ārani agni kaṇaṁ
dībānni sūbĕḍuduṁdo? tābāna balibĕḍuduṁdo?
amṛtamo hālāhalamo emo prema guṇaṁ ā ā ā ā
e kṣhaṇāna ĕlāga māruno premiṁche hṛdayaṁ ā ā ā ā

ālayāna hāradilo ākhari sidimaṁṭalalo
rĕṁḍiḍilo nijānigunnadi ŏgaḍe agni guṇaṁ

saraṇaṁ 1:

ĕṁḍamāvilo ĕṁta vĕdiginā nīḍi sĕmma dŏrigenā..
guṁḍĕ bāvilo vunna āśha taḍi āviri avudunnā
prabaṁchānni maribiṁchelā maṁtriṁche o premā
ĕlā ninnu kanibĕṭṭālo āsūgī ivvammā
nī jāḍa tĕliyani prāṇaṁ sestoṁdi gagana prayāṇaṁ
ĕdara vuṁdi naḍireyannadi ī saṁdhyā samayaṁ
e kṣhaṇāna ĕlāga māruno premiṁche hṝdayaṁ

ālayāna hāradilo ākhari sidimaṁṭalalo
rĕṁḍiḍilo nijānigunnadi ŏgaḍe agni guṇaṁ

saraṇaṁ 2:

sūryabiṁbame astamiṁchanide melugoni kala kosaṁ
kaḽḽu mūsuguni kalavariṁchĕne kaṁṭibāba pābaṁ
āyuvichchi pĕṁchina baṁdhaṁ maunaṁlo masiyainā
reyi sāḍu svapnaṁ kosaṁ ālābana āgenā
pŏṁdedi edemainā poyiṁdi tirigŏsenā
kaṁṭi pāba kala aḍigiṁdani niduriṁche nayanaṁ
e kṣhaṇāna ĕlāga mārunŏ premiṁche hṛdayaṁ

ālayāna hāradilo ākhari sidimaṁṭalalo
rĕṁḍiḍilo nijānigunnadi ŏgaḍe agni guṇaṁ
prema ane padāna vunnadī arani agni kaṇaṁ
dībānni sūbĕḍuduṁdo tābāna balibĕḍuduṁdo
amṛtamo hālāhalamo emo prema guṇaṁ ā ā ā ā .
e kṣhaṇāna ĕlāga mārunŏ premiṁche hṛdayaṁ ā ā ā ā..