ఆలనట మగఁడట అవుఁగాము లిందునేల
(॥పల్లవి॥)
ఆలనట మగఁడట అవుఁగాము లిందునేల
తాలిమితో నే నుండే తరియైనదాఁకను
(॥అల॥)
ఆయలేవే చాలుఁజాలు అప్పటిఁ గొసరనేల
చాయల నేఁ బిలిచితే చనుదెంచీనా
వోయమ్మ కలి వోయ నుట్టి దిక్కు చూడనేల
సేయనీవే తనచేఁత చెల్లియయందాఁకను
(॥అల॥)
పోపో వె తనతోడి పురుఁడు వెట్టుకోనేల
దావులఁ జిల్లరపొందు తా మానీనా
మాపుదాఁకా ఱాలు దింటా మలిగం డ్లేరనేల
తీపులఁ దాఁ బడనీవే తెలిసినందాఁకను
(॥అల॥)
చాలులేవు తనతోడ సారెసారె వాదులేల
వోలి దారుకాణించితే నోడఁబడీనా
గాలిగలప్పుడే తూర్పుగాక శ్రీవేంకటపతి
యేలి నన్నుఁ గూడె నే నిరవైనదాఁకను
(||pallavi||)
ālanaḍa magam̐ḍaḍa avum̐gāmu liṁdunela
tālimido ne nuṁḍe tariyainadām̐kanu
(||ala||)
āyaleve sālum̐jālu appaḍim̐ gŏsaranela
sāyala nem̐ biliside sanudĕṁchīnā
voyamma kali voya nuṭṭi dikku sūḍanela
seyanīve tanasem̐ta sĕlliyayaṁdām̐kanu
(||ala||)
pobo vĕ tanadoḍi purum̐ḍu vĕṭṭugonela
dāvulam̐ jillarabŏṁdu tā mānīnā
mābudām̐kā ṟālu diṁṭā maligaṁ ḍleranela
tībulam̐ dām̐ baḍanīve tĕlisinaṁdām̐kanu
(||ala||)
sālulevu tanadoḍa sārĕsārĕ vādulela
voli dārugāṇiṁchide noḍam̐baḍīnā
gāligalappuḍe tūrbugāga śhrīveṁkaḍabadi
yeli nannum̐ gūḍĕ ne niravainadām̐kanu