ఆకెకు నీకుఁ దెలుసు నా సుద్దులు
(॥పల్లవి॥)
ఆకెకు నీకుఁ దెలుసు నా సుద్దులు
చేకొని తగవులెట్టు చెప్పేమయ్య మీకు
(॥అకె॥)
సోలసిసోలసి నిన్నుఁ జూచిచూచి మాటలాడీ
యెలమి నాపె నీతో నేఁటికోకాని
తలుపుమాటున నుండి తనివోక నన్వీని
చెలరేఁగి తను నేమిసేసితివోకాని
(॥అకె॥)
సన్నల చాయల నిన్ను జరసీని పలుమారు
ఇన్నిటా నీవొడఁబాటు లెట్టివోకాని
యెన్నిమారులైనఁ జేతులెత్తియెత్తి మొక్కీని
పన్నినతారుకాణ లేపగిదివోకాని
(॥అకె॥)
కూటమితో సారెసారె కొలువుసేసీ నీకు
పాటించి మీకెట్టిమాటపట్లోకాని
నీటున శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
వాఁటాన నన్నేలితి వాపెవరు సేదో కాని
(||pallavi||)
āgĕgu nīgum̐ dĕlusu nā suddulu
segŏni tagavulĕṭṭu sĕppemayya mīgu
(||agĕ||)
solasisolasi ninnum̐ jūsisūsi māḍalāḍī
yĕlami nābĕ nīdo nem̐ṭigogāni
talubumāḍuna nuṁḍi tanivoga nanvīni
sĕlarem̐gi tanu nemisesidivogāni
(||agĕ||)
sannala sāyala ninnu jarasīni palumāru
inniḍā nīvŏḍam̐bāḍu lĕṭṭivogāni
yĕnnimārulainam̐ jedulĕttiyĕtti mŏkkīni
panninadārugāṇa lebagidivogāni
(||agĕ||)
kūḍamido sārĕsārĕ kŏluvusesī nīgu
pāḍiṁchi mīgĕṭṭimāḍabaṭlogāni
nīḍuna śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
vām̐ṭāna nannelidi vābĕvaru sedo kāni