Aage yeduvamtidi naa kaanadeevayyaa

ఆకె యెటువంటిది నా కానతీవయ్యా
Language

(॥పల్లవి॥)
ఆకె యెటువంటిది నా కానతీవయ్యా
చేకొని యిద్దరిఁ బెండ్లిసేసే నిన్నిపుడు

(॥ఆకె॥)
పడఁతిచన్నుల మీఁద పాదాలద్దుకొంటాను
అడరినకాఁక చల్లార్చుకొనేవు
యెడసి యెవ్వతో నిన్ను యేఁపులఁ బెట్టఁగఁబోలు
కడునీతమక మెల్లా కానవచ్చె నాకును

(॥ఆకె॥)
జలజాక్షిపయ్యద సారెఁ గప్పుకొంటాను
వొలుకుఁజెమట తడియెత్తుకొనేవు
వలపించెవ్వతో వుమ్మగిల నిన్నుఁ జేయఁబోలు
వెలి నీవిరహమెల్లా వెల్లవిరులాయను

(॥ఆకె॥)
జవ్వని మోవితేనెలు చవిగొని తొడిఁబడ
అవ్వలిరతులదప్పి యాఁపుకొనేవు
ఇవ్వల శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
దవ్వులాకెపొందు లిందెతారుకాణ వచ్చెను

(||pallavi||)
āgĕ yĕḍuvaṁṭidi nā kānadīvayyā
segŏni yiddarim̐ bĕṁḍlisese ninnibuḍu

(||āgĕ||)
paḍam̐tisannula mīm̐da pādāladdugŏṁṭānu
aḍarinagām̐ka sallārsugŏnevu
yĕḍasi yĕvvado ninnu yem̐pulam̐ bĕṭṭam̐gam̐bolu
kaḍunīdamaga mĕllā kānavachchĕ nāgunu

(||āgĕ||)
jalajākṣhibayyada sārĕm̐ gappugŏṁṭānu
vŏlugum̐jĕmaḍa taḍiyĕttugŏnevu
valabiṁchĕvvado vummagila ninnum̐ jeyam̐bolu
vĕli nīvirahamĕllā vĕllavirulāyanu

(||āgĕ||)
javvani movidenĕlu savigŏni tŏḍim̐baḍa
avvaliraduladappi yām̐pugŏnevu
ivvala śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
davvulāgĕbŏṁdu liṁdĕdārugāṇa vachchĕnu