Aage yade piluvare amdaru no selulaala

ఆకె యదె పిలువరే అందరు నో చెలులాల
Language

(॥పల్లవి॥)
ఆకె యదె పిలువరే అందరు నో చెలులాల
చేకొని పతి వేడుక చెల్లించవలెను

(॥ఆకె॥)
మగువ దనునాడినమాటలు దలఁచుకొంటా
తగినచక్కఁదనాలు తలఁచుకొంటా
నగుతాఁ బొందుసేసినననుపుఁ దలచుకొంటా
వొగి లోనఁ బవళించి వున్నాఁడు రమణుఁడు

(॥ఆకె॥)
పడఁతిపక్కననుండినభావము దలఁచుకొంటా
తడఁబాటురతులెల్లాఁ దలఁచుకొంటా
కడుమనోరథములు కల్పించి తలఁచుకొంటా
వుడివోనివేడుకతో నున్నాఁడు రమణుఁడు

(॥ఆకె॥)
అలమేలుమంగచేఁత లన్నియు దలఁచుకొంటా
తలకొన్ననేరుపులు దలచుకొంటా
కలసి ఇప్పుడు తొంటికతలు దలఁచుకొంటా
వెలయుచున్నాఁడు శ్రీవేంకరమణుఁడు

(||pallavi||)
āgĕ yadĕ piluvare aṁdaru no sĕlulāla
segŏni padi veḍuga sĕlliṁchavalĕnu

(||āgĕ||)
maguva danunāḍinamāḍalu dalam̐sugŏṁṭā
taginasakkam̐danālu talam̐sugŏṁṭā
nagudām̐ bŏṁdusesinananubum̐ dalasugŏṁṭā
vŏgi lonam̐ bavaḽiṁchi vunnām̐ḍu ramaṇum̐ḍu

(||āgĕ||)
paḍam̐tibakkananuṁḍinabhāvamu dalam̐sugŏṁṭā
taḍam̐bāḍuradulĕllām̐ dalam̐sugŏṁṭā
kaḍumanorathamulu kalbiṁchi talam̐sugŏṁṭā
vuḍivoniveḍugado nunnām̐ḍu ramaṇum̐ḍu

(||āgĕ||)
alamelumaṁgasem̐ta lanniyu dalam̐sugŏṁṭā
talagŏnnanerubulu dalasugŏṁṭā
kalasi ippuḍu tŏṁṭigadalu dalam̐sugŏṁṭā
vĕlayusunnām̐ḍu śhrīveṁkaramaṇum̐ḍu