Aage neege tagu namarum bemdligi

ఆకె నీకే తగు నమరుఁ బెండ్లికి
Language

(॥పల్లవి॥)
ఆకె నీకే తగు నమరుఁ బెండ్లికి
పోఁక ముడిచితిమి పొలఁతికి నేము

(॥ఆకె॥)
కొండల వంటివి కోమలి కుచములు
బండగు రాలురప్పలుఁ గావు
దండనే నెమ్మోవు తామెరవంటిది
గుండుమూఁకరేకులవలెఁ గాదు

(॥ఆకె॥)
మెలుఁతనెరిఁదురుము మేఘము వంటిది
అలరు గాలిగొట్టది గాదు
చెలవపు నడుమిది సింహమువంటిది
పొలసి అడవిఁగాఁపురమటు గాదు

(॥ఆకె॥)
సతిమేను మెఱుఁగు చాయ వంటిది
తతితో మెరిచటు దాఁగదు
యితవగు శ్రీవేంకటేశ యీ చెలికిఁ
బతివై కూడితివి పలుకెడగాదు

(||pallavi||)
āgĕ nīge tagu namarum̐ bĕṁḍligi
pom̐ka muḍisidimi pŏlam̐tigi nemu

(||āgĕ||)
kŏṁḍala vaṁṭivi komali kusamulu
baṁḍagu rālurappalum̐ gāvu
daṁḍane nĕmmovu tāmĕravaṁṭidi
guṁḍumūm̐karegulavalĕm̐ gādu

(||āgĕ||)
mĕlum̐tanĕrim̐durumu meghamu vaṁṭidi
alaru gāligŏṭṭadi gādu
sĕlavabu naḍumidi siṁhamuvaṁṭidi
pŏlasi aḍavim̐gām̐puramaḍu gādu

(||āgĕ||)
sadimenu mĕṟum̐gu sāya vaṁṭidi
tadido mĕrisaḍu dām̐gadu
yidavagu śhrīveṁkaḍeśha yī sĕligim̐
badivai kūḍidivi palugĕḍagādu