Aagaashamlonee samdamaama

ఆకాశంలోనీ చందమామ
Year
Language

పల్లవి:

ఆకాశంలోనీ చందమామ
బంగారు పాపై వచ్చేనమ్మా
సాగరమాయే సంబరమే
స్వాగతమాయే సంతసమే
నాలోని ప్రేమ ప్రతిరూపమే
ఈ ఇంట తానే సిరిదీపమే

ఆకాశంలోనీ చందమామ
బంగారు పాపై వచ్చేనమ్మా
సాగరమాయే సంబరమే
స్వాగతమాయే సంతసమే
నాలోని ప్రేమ ప్రతిరూపమే
ఈ ఇంట తానే సిరిదీపమే

చరణం 1:

నింగిలో నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా
సాగరం పొంగులన్నీగవ్వల గౌను చేస్తా గారం చేస్తా
తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా
చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా
హరివిల్లే కాగా ఉయ్యాలలే
కోయిలలే పాడే నా జోలలే
బొమ్మలుగా మారే ఆ చుక్కలే
దిష్టంతా తీసే నలుదిక్కులే

చరణం 2:

పాపలో అందమంతా బ్రహ్మకే అందనంత ఎంతో వింత
అమ్మలో ప్రేమ అంతా నాన్నలో ఠీవి అంతా వచ్చేనంట
తీయని నవ్వేమో దివి తారల వెలుగంటా
కమ్మని పిలుపేమో ఈ అమ్మకు పులకింతా
అడుగేసి తీస్తే హంసజోడి
కులుకుల్లో తానే కూచిపూడి
చిరునవ్వులోన శ్రీరమణి
మారాము చేసే బాలామణి

ఆకాశంలోనీ చందమామ
బంగారు పాపై వచ్చేనమ్మా
సాగరమాయే సంబరమే
స్వాగతమాయే సంతసమే
నాలోని ప్రేమ ప్రతిరూపమే
ఈ ఇంట తానే సిరిదీపమే

pallavi:

āgāśhaṁlonī saṁdamāma
baṁgāru pābai vachchenammā
sāgaramāye saṁbarame
svāgadamāye saṁtasame
nāloni prema pradirūbame
ī iṁṭa tāne siridībame

āgāśhaṁlonī saṁdamāma
baṁgāru pābai vachchenammā
sāgaramāye saṁbarame
svāgadamāye saṁtasame
nāloni prema pradirūbame
ī iṁṭa tāne siridībame

saraṇaṁ 1:

niṁgilo nīlamaṁtā uṁgaraṁ sesi istā ūregistā
sāgaraṁ pŏṁgulannīgavvala gaunu sestā gāraṁ sestā
tĕllani enugubai nā pābani ĕkkistā
silagalu haṁsalani āḍeṁdugu rappistā
hariville kāgā uyyālale
koyilale pāḍe nā jolale
bŏmmalugā māre ā sukkale
diṣhṭaṁtā tīse naludikkule

saraṇaṁ 2:

pābalo aṁdamaṁtā brahmage aṁdanaṁta ĕṁto viṁta
ammalo prema aṁtā nānnalo ṭhīvi aṁtā vachchenaṁṭa
tīyani navvemo divi tārala vĕlugaṁṭā
kammani pilubemo ī ammagu pulagiṁtā
aḍugesi tīste haṁsajoḍi
kulugullo tāne kūsibūḍi
sirunavvulona śhrīramaṇi
mārāmu sese bālāmaṇi

āgāśhaṁlonī saṁdamāma
baṁgāru pābai vachchenammā
sāgaramāye saṁbarame
svāgadamāye saṁtasame
nāloni prema pradirūbame
ī iṁṭa tāne siridībame