ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు
పల్లవి:
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు
సాగర వీధిని కెరటాలు ఆకాశానికి చేరవు
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు
సాగర వీధిని కెరటాలు ఆకాశానికి చేరవు
ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు...
చరణం 1:
మెరిసే మబ్బులు కురిసే వరకే మేఘమాలికలూ
గగనవీధిలో కరిగిపోయే రాగమాలికలూ || మెరిసే మబ్బులు ||
నిలకడ లేని మెరుపులు చూసి మనుగడ అనుకోకూ || 2 ||
మట్టికి బిడ్డలు మణులు మనుషులు అదే మరిచిపోకూ
అదే మరిచిపోకూ || ఆకాశంలో తారకలు ||
చరణం 2:
అమావాస్యలో చందమామకై వెతకవద్దు నీవూ
అంధకారమే వెలుగు చేసుకొని బతకవద్దు నీవూ || అమావాస్యలో ||
ఏమీ లేని ఆకాశంలో ఇంద్రధనుసు చూడూ || 2 ||
పేదబతుకులో పెద్దమనసునే మనసు పెట్టి చూడూ
నా మనసు విప్పి చూడూ || ఆకాశంలో తారకలు ||
pallavi:
āgāśhaṁlo tāragalu āgāśhānigi sĕṁdavu
sāgara vīdhini kĕraḍālu āgāśhānigi seravu
āgāśhaṁlo tāragalu āgāśhānigi sĕṁdavu
sāgara vīdhini kĕraḍālu āgāśhānigi seravu
āgāśhaṁlo tāragalu āgāśhānigi sĕṁdavu...
saraṇaṁ 1:
mĕrise mabbulu kurise varage meghamāligalū
gaganavīdhilo karigiboye rāgamāligalū || mĕrise mabbulu ||
nilagaḍa leni mĕrubulu sūsi manugaḍa anugogū || 2 ||
maṭṭigi biḍḍalu maṇulu manuṣhulu ade marisibogū
ade marisibogū || āgāśhaṁlo tāragalu ||
saraṇaṁ 2:
amāvāsyalo saṁdamāmagai vĕdagavaddu nīvū
aṁdhagārame vĕlugu sesugŏni badagavaddu nīvū || amāvāsyalo ||
emī leni āgāśhaṁlo iṁdradhanusu sūḍū || 2 ||
pedabadugulo pĕddamanasune manasu pĕṭṭi sūḍū
nā manasu vippi sūḍū || āgāśhaṁlo tāragalu ||