(॥పల్లవి॥)
ఆతురమే నెలవాయనమ్మా యీ-
యేతులునుఁ దాలిములు యెరవౌట యరుదా
(॥ఆతు॥)
డిందుపడి సొబగులకు ద్రిష్టిదాఁకినయట్లు
అందమే పరితాపమాయనమ్మా
చెంది హృదయఁ(యం?) బెల్ల చేకొన్నరమణుఁడే
పందెమడిచినయట్ల పగయౌట అరుదా
(॥ఆతు॥)
సొలపులఁ గనుచూపులకు సోఁకు సోఁకినయట్లు
అలసత మైమఱుపు లాయనమ్మా
పిలిచి విభుఁగూర్చుటకు పెరరేఁచు నెచ్చెలులె
కలలోని చెలిమివలె కడకేఁగు టరుదా
(॥ఆతు॥)
చెప్పనరుదగుమరునిచేఁతవలె తరుణితురు-
మప్పుడే చిందువందాయనమ్మా
యిప్పుడే శ్రీవేంకటేశకు కాఁగిట నింతి-
వొప్పులే తప్పులై వొత్తగిలు టరుదా
(||pallavi||)
ādurame nĕlavāyanammā yī-
yedulunum̐ dālimulu yĕravauḍa yarudā
(||ādu||)
ḍiṁdubaḍi sŏbagulagu driṣhṭidām̐kinayaṭlu
aṁdame paridābamāyanammā
sĕṁdi hṛdayam̐(yaṁ?) bĕlla segŏnnaramaṇum̐ḍe
paṁdĕmaḍisinayaṭla pagayauḍa arudā
(||ādu||)
sŏlabulam̐ ganusūbulagu som̐ku som̐kinayaṭlu
alasada maimaṟubu lāyanammā
pilisi vibhum̐gūrsuḍagu pĕrarem̐su nĕchchĕlulĕ
kalaloni sĕlimivalĕ kaḍagem̐gu ṭarudā
(||ādu||)
sĕppanarudagumarunisem̐tavalĕ taruṇiduru-
mappuḍe siṁduvaṁdāyanammā
yippuḍe śhrīveṁkaḍeśhagu kām̐giḍa niṁti-
vŏppule tappulai vŏttagilu ṭarudā