ఆడుకోఁగలిగె మాకు నందరముఁ జెలులము
(॥పల్లవి॥)
ఆడుకోఁగలిగె మాకు నందరముఁ జెలులము
జాడల సతులు నీ సరి యెవ్వరమ్మా
(॥ఆడు॥)
అదివో పతిఁ బిలువ నంపి రప్పించుకొంటివి
యెదుట నాపనితొడ యెక్కుకొంటివి
మెదలనియ్యక అట్టె మెడగట్టించుకొంటివి
వెదకి పువ్వులదండ వేసి తీసి కొంటివి
(॥ఆడు॥)
తేరాని వైనాఁ జెప్పి తెప్పించుకొంటివి నీవు
మేరలు సేసుక వీఁపుమీఁద నుంటివి
కూరిమి నీవే దక్కించుకొంటి వడవుల వెంట
చేరి పచ్చనిఅలమై శిరసు నిండితివి
(॥ఆడు॥)
విందుల నీవే పదారువేలు రూపులై మించితి
వెందు నీపేరే మొదల నెంపించితివి
కందువ శ్రీ వేంకటేశు కాఁగిటిలోపల నిండి
సందడిం చాతనిసర్వసంపదవు నైతివి
(||pallavi||)
āḍugom̐galigĕ māgu naṁdaramum̐ jĕlulamu
jāḍala sadulu nī sari yĕvvarammā
(||āḍu||)
adivo padim̐ biluva naṁpi rappiṁchugŏṁṭivi
yĕduḍa nābanidŏḍa yĕkkugŏṁṭivi
mĕdalaniyyaga aṭṭĕ mĕḍagaṭṭiṁchugŏṁṭivi
vĕdagi puvvuladaṁḍa vesi tīsi kŏṁṭivi
(||āḍu||)
terāni vainām̐ jĕppi tĕppiṁchugŏṁṭivi nīvu
meralu sesuga vīm̐pumīm̐da nuṁṭivi
kūrimi nīve dakkiṁchugŏṁṭi vaḍavula vĕṁṭa
seri pachchanialamai śhirasu niṁḍidivi
(||āḍu||)
viṁdula nīve padāruvelu rūbulai miṁchidi
vĕṁdu nībere mŏdala nĕṁpiṁchidivi
kaṁduva śhrī veṁkaḍeśhu kām̐giḍilobala niṁḍi
saṁdaḍiṁ sādanisarvasaṁpadavu naidivi