Aadarimchi mamchimaada laademgaaga

ఆదరించి మంచిమాట లాడేఁగాక
Language

(॥పల్లవి॥)
ఆదరించి మంచిమాట లాడేఁగాక
భేదము సేయ కాతనిఁ బిలువవే చెలియా

(॥ఆద॥)
కోరేటికోరికలెల్లా గురియైయుండేటివాని
పారపుమోవితేనె లొసఁగేటివాని
చేరి చేతులెత్తి నాపై సేసలు వెట్టినవాని
తూరి యేమిసేసినాను దూరనెట్టు వచ్చునే

(॥అద॥)
కూడిపాయరానినెట్టుకొన్న చుట్టమైనవాని
వీడెముపొత్తుకు లోనై వెలసేవాని
జోడుగూడేయాసలకు చోటై యుండేటివాని
యేడనుండివచ్చినాను యెట్టు దూరవచ్చునే

(॥ఆద॥)
సరుస నాకాఁగిటికే సతమైయుండేటివాని
మరిగిననామనసు మర్మపువాని
పరగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశుని
తొరల నన్నేలె నిఁక దూరనెట్టువచ్చునే

(||pallavi||)
ādariṁchi maṁchimāḍa lāḍem̐gāga
bhedamu seya kādanim̐ biluvave sĕliyā

(||āda||)
koreḍigorigalĕllā guriyaiyuṁḍeḍivāni
pārabumovidenĕ lŏsam̐geḍivāni
seri sedulĕtti nābai sesalu vĕṭṭinavāni
tūri yemisesinānu dūranĕṭṭu vachchune

(||ada||)
kūḍibāyarāninĕṭṭugŏnna suṭṭamainavāni
vīḍĕmubŏttugu lonai vĕlasevāni
joḍugūḍeyāsalagu soḍai yuṁḍeḍivāni
yeḍanuṁḍivachchinānu yĕṭṭu dūravachchune

(||āda||)
sarusa nāgām̐giḍige sadamaiyuṁḍeḍivāni
mariginanāmanasu marmabuvāni
paraga nalamelmaṁgabadi śhrīveṁkaḍeśhuni
tŏrala nannelĕ nim̐ka dūranĕṭṭuvachchune