ఆడనుండి మోవి దిట్టే వంతేకాదా వలపు
(॥పల్లవి॥)
ఆడనుండి మోవి దిట్టే వంతేకాదా వలపు
బూడిదెలో వసంతమా పోపో అంతేకాదా
(॥ఆడ॥)
నేనేడ నీవేడ నీతోడివారమా
ఆనలువెట్టఁగవచ్చే వంతేకాదా
దానికేమి గొరతా తతిలేదు మితిలేదు
మానవుగా జగడాలు మరి యంతేకాదా
(॥ఆడ॥)
దాఁపనేల రాఁపులేల తడవవచ్చితిమా
ఆపెచేతఁ బిలిపించే వంతేకాదా
పై పై నింకానేల పంతనాలు మంతనాలు
మాపుదాకా సరసము మరి యంతేకాదా
(॥ఆడ॥)
వన్నెలంత వాసులెంత వద్దనేటిదాననా
అన్నిటా వేసాలు చల్లే వంతేకాదా
వున్నతి శ్రీ వేంకటాద్రి నుండి వావిలిపాటిలో
మన్నించితి రామచంద్ర మరి యంతేకాదా
(||pallavi||)
āḍanuṁḍi movi diṭṭe vaṁtegādā valabu
būḍidĕlo vasaṁtamā pobo aṁtegādā
(||āḍa||)
neneḍa nīveḍa nīdoḍivāramā
ānaluvĕṭṭam̐gavachche vaṁtegādā
dānigemi gŏradā tadiledu midiledu
mānavugā jagaḍālu mari yaṁtegādā
(||āḍa||)
dām̐panela rām̐pulela taḍavavachchidimā
ābĕsedam̐ bilibiṁche vaṁtegādā
pai pai niṁkānela paṁtanālu maṁtanālu
mābudāgā sarasamu mari yaṁtegādā
(||āḍa||)
vannĕlaṁta vāsulĕṁta vaddaneḍidānanā
anniḍā vesālu salle vaṁtegādā
vunnadi śhrī veṁkaḍādri nuṁḍi vāvilibāḍilo
manniṁchidi rāmasaṁdra mari yaṁtegādā