Aadanumde yemigallaa naanadiyyaraa

ఆడనుండే యేమిగల్లా నానతియ్యరా
Language

(॥పల్లవి॥)
ఆడనుండే యేమిగల్లా నానతియ్యరా
యేడనున్నా మనసులు యేకమౌటే చాలును

(॥ఆడ॥)
కొప్పుతుమ్మిదలు నాకు గొబ్బున బెదరుఁ జేసు
దప్పితో నవ్వు నవ్వక తలరా నీవు
అప్పటి కన్నుఁజకోరా లవి యులుకునో యేమో
చప్పుడు సేయక నీవు చక్కజాడ నుండరా

(॥ఆడ॥)
చన్ను జక్కవలు నేడు సరిగ కదలుం జేసు
సన్నలు సేయకు మింతె చాలించరా
అన్నువనానడవుల, అంచలు బెగడుఁ జేసు
నన్నుం బేరుకొనకురా నటనల కిపుడు

(॥ఆడ॥)
కుత్తికలో నాయెలుఁగుకోవిన బెదరుఁ జేసు
హత్తి నన్నుఁ జెనకకు మంతేసి నీవు
పొత్తుల శ్రీవేంకటేశ పొందితివి నన్ను నిట్టె
సత్తుగ నేనీకు సతమైతిఁ జాలదా

(||pallavi||)
āḍanuṁḍe yemigallā nānadiyyarā
yeḍanunnā manasulu yegamauḍe sālunu

(||āḍa||)
kŏppudummidalu nāgu gŏbbuna bĕdarum̐ jesu
dappido navvu navvaga talarā nīvu
appaḍi kannum̐jagorā lavi yuluguno yemo
sappuḍu seyaga nīvu sakkajāḍa nuṁḍarā

(||āḍa||)
sannu jakkavalu neḍu sariga kadaluṁ jesu
sannalu seyagu miṁtĕ sāliṁcharā
annuvanānaḍavula, aṁchalu bĕgaḍum̐ jesu
nannuṁ berugŏnagurā naḍanala kibuḍu

(||āḍa||)
kuttigalo nāyĕlum̐gugovina bĕdarum̐ jesu
hatti nannum̐ jĕnagagu maṁtesi nīvu
pŏttula śhrīveṁkaḍeśha pŏṁdidivi nannu niṭṭĕ
sattuga nenīgu sadamaidim̐ jāladā