(॥పల్లవి॥)
ఆడనుండే లాగవేగా లాడవద్దు
యీడనే నీ కాఁగిలి నాకిప్పుడే యిమ్మా
(॥ఆడ॥)
చెలిగట్టినచెంగావిచీర కొంగు గానవచ్చీ
మలసి నీపచ్చడము మాటునను
నెలఁత నీవద్దలేదని నిజము నెరపేవు
తెలిసె నాపానుపుమీఁదికి నీవు రమ్మా
(॥ఆడ॥)
తరుణిసొమ్ముల కాంతి తళుకున మెరిచీని
సరి నీనిలువుమేనిసందుసందుల
అరుదై యెవ్వతె దాఁచనని వొడఁబరచేవు
పరగ నిప్పుడే నాపక్కకు రమ్మా
(॥ఆడ॥)
వనితతనువువింతవాసనలు పొలసీని
నినుపుఁ జెమటగారే నీచెక్కులను
యెనసితి వేంకటేశ నేనలమేల్మంగ-
నొనర నాకెనుఁ జూపే నొద్దికతో రమ్మా
(||pallavi||)
āḍanuṁḍe lāgavegā lāḍavaddu
yīḍane nī kām̐gili nāgippuḍe yimmā
(||āḍa||)
sĕligaṭṭinasĕṁgāvisīra kŏṁgu gānavachchī
malasi nībachchaḍamu māḍunanu
nĕlam̐ta nīvaddaledani nijamu nĕrabevu
tĕlisĕ nābānubumīm̐digi nīvu rammā
(||āḍa||)
taruṇisŏmmula kāṁti taḽuguna mĕrisīni
sari nīniluvumenisaṁdusaṁdula
arudai yĕvvadĕ dām̐sanani vŏḍam̐barasevu
paraga nippuḍe nābakkagu rammā
(||āḍa||)
vanidadanuvuviṁtavāsanalu pŏlasīni
ninubum̐ jĕmaḍagāre nīsĕkkulanu
yĕnasidi veṁkaḍeśha nenalamelmaṁga-
nŏnara nāgĕnum̐ jūbe nŏddigado rammā