Aadanigi naalavaide nauduvu gaaga

ఆతనికి నాలవైతే నౌదువు గాక
Language

(॥పల్లవి॥)
ఆతనికి నాలవైతే నౌదువు గాక
యేతులు నెమ్మెలు మాతో నేమిటికి యిపుడు

(॥ఆత॥)
నెయ్యాన నే నాతనిపై నెరుసు వెదకితేను
చయ్యాటాలకు రానేలే సారెకు నీవు
నియ్యంత నేనేరనా నీవే బత్తిగలవా
పుయ్యక దూలతనాల పోరకునే ఇప్పుడు

(॥ఆత॥)
కోరి వేఁడి నే నాతని గూరిమి గొసరితేను
ఆరీతి నీవిపుడేల అందుకొనేవే
యీరసము నాకున్నదా యింత నీవు చుట్టమవా
వీరుత్తరాలు మాతోను విడువవే ఇఁకను

(॥ఆత॥)
శ్రీ వేంకటేశ్వరుని చేకొని నేఁ గూడితేను
కావలించి నీవేల కాఁతాళించేవే
భావించ నే నేరనా పంతగత్తెవా నీవు
పూవుకుఁ దుమ్మిదవలె పొదిగే వేమిటికే

(||pallavi||)
ādanigi nālavaide nauduvu gāga
yedulu nĕmmĕlu mādo nemiḍigi yibuḍu

(||āda||)
nĕyyāna ne nādanibai nĕrusu vĕdagidenu
sayyāḍālagu rānele sārĕgu nīvu
niyyaṁta neneranā nīve battigalavā
puyyaga dūladanāla poragune ippuḍu

(||āda||)
kori vem̐ḍi ne nādani gūrimi gŏsaridenu
ārīdi nīvibuḍela aṁdugŏneve
yīrasamu nāgunnadā yiṁta nīvu suṭṭamavā
vīruttarālu mādonu viḍuvave im̐kanu

(||āda||)
śhrī veṁkaḍeśhvaruni segŏni nem̐ gūḍidenu
kāvaliṁchi nīvela kām̐tāḽiṁcheve
bhāviṁcha ne neranā paṁtagattĕvā nīvu
pūvugum̐ dummidavalĕ pŏdige vemiḍige