ఆతని తలఁపు గంటి రంత చాలదా నేఁడు
(॥పల్లవి॥)
ఆతని తలఁపు గంటి రంత చాలదా నేఁడు
చేతిచెక్కుతోడ వట్టి చింతనకేలమ్మా
(॥ఆత॥)
వీడెమిచ్చెఁ జాలదా వేగించితే నేమాయ
తోడ మాటలాడకుంటే దోసమా యేమి
వాడికాయ సందడినే వలపింత చాలదా
సూడుఁబాడు పంతాలకుఁ జోటేదమ్మా
(॥ఆత॥)
ఆలనైతిఁ జాలదా అలిగుంటే నేమాయ
కాలుదొక్కని దొక్కటే కడమింతే పో
వేలు వెట్టి యిమ్మగొనె వెనకకే చాలదా
నాలుక బెల్లాలు చూపె నాయము గాదమ్మా
(॥ఆత॥)
యింటికివచ్చెఁ జాలదా యేడ నున్న నేమాయ
వొంటి మోవి పిప్పెయిన దొక్కటె కాక
అంటి పట్టి శ్రీవేంకటాద్రిపతి నన్నుఁగాడె
వెంటఁ బాయలే మిఁక వెలితి లేదమ్మా
(||pallavi||)
ādani talam̐pu gaṁṭi raṁta sāladā nem̐ḍu
sedisĕkkudoḍa vaṭṭi siṁtanagelammā
(||āda||)
vīḍĕmichchĕm̐ jāladā vegiṁchide nemāya
toḍa māḍalāḍaguṁṭe dosamā yemi
vāḍigāya saṁdaḍine valabiṁta sāladā
sūḍum̐bāḍu paṁtālagum̐ joḍedammā
(||āda||)
ālanaidim̐ jāladā aliguṁṭe nemāya
kāludŏkkani dŏkkaḍe kaḍamiṁte po
velu vĕṭṭi yimmagŏnĕ vĕnagage sāladā
nāluga bĕllālu sūbĕ nāyamu gādammā
(||āda||)
yiṁṭigivachchĕm̐ jāladā yeḍa nunna nemāya
vŏṁṭi movi pippĕyina dŏkkaḍĕ kāga
aṁṭi paṭṭi śhrīveṁkaḍādribadi nannum̐gāḍĕ
vĕṁṭam̐ bāyale mim̐ka vĕlidi ledammā