Aadani sittamu vachchinatte melamgavaddaa

ఆతని చిత్తము వచ్చినట్టే మెలఁగవద్దా
Language

(॥పల్లవి॥)
ఆతని చిత్తము వచ్చినట్టే మెలఁగవద్దా
కాతరించి మరి యాల కక్కసించేవే

(॥ఆత॥)
వలపుగలవారికి వాసులేమీ నెంచరాదు
పిలిచితే నౌఁగాదని పెనఁగరాదు
మలసి యెవ్వతెతోనో మాఁటలాడె నాతఁడంటా
చలపట్టి పతినేల సాదించేవే

(॥ఆత॥)
చుట్టరిక మమరితే సూళ్ళువెదకరాదు
పట్టి కాఁగిలించుకొంటే పాయఁగరాదు
తొట్టి వూడిగపుదానితో నాతఁడు నవ్వెనంటా
ఇట్టె రమణుని నేరాలేల యెంచేవే

(॥ఆత॥)
వావులు గలసితేనే వోద్దని తోయఁగరాదు
వోవరిలోఁ గూడె నిన్ను వొడ్డుకోరాదు
సోవగాఁ బొరుగు సతిఁ జూచి చన్నులంటెనంటా
శ్రీవేంకటేశ్వరు నేల చెక్కు నొక్కేవే

(||pallavi||)
ādani sittamu vachchinaṭṭe mĕlam̐gavaddā
kādariṁchi mari yāla kakkasiṁcheve

(||āda||)
valabugalavārigi vāsulemī nĕṁcharādu
piliside naum̐gādani pĕnam̐garādu
malasi yĕvvadĕdono mām̐ṭalāḍĕ nādam̐ḍaṁṭā
salabaṭṭi padinela sādiṁcheve

(||āda||)
suṭṭariga mamaride sūḽḽuvĕdagarādu
paṭṭi kām̐giliṁchugŏṁṭe pāyam̐garādu
tŏṭṭi vūḍigabudānido nādam̐ḍu navvĕnaṁṭā
iṭṭĕ ramaṇuni nerālela yĕṁcheve

(||āda||)
vāvulu galasidene voddani toyam̐garādu
vovarilom̐ gūḍĕ ninnu vŏḍḍugorādu
sovagām̐ bŏrugu sadim̐ jūsi sannulaṁṭĕnaṁṭā
śhrīveṁkaḍeśhvaru nela sĕkku nŏkkeve