ఆతని చిత్తము వచ్చినదే పదివేలుగాక
(॥పల్లవి॥)
ఆతని చిత్తము వచ్చినదే పదివేలుగాక
చేతులెత్తి మొక్కే నేను చిత్తగించుమనవే
(॥ఆత॥)
చెల్లుబడి గలిగితే చెనకి కొసరవలె
వొల్లనే కొంకితే నూరకుండవలెను
పల్లదాన రమణుని బలిమి సేసితేను
యెల్లవారూ నాఁట దాని నెంత గయ్యాళెనరా
(॥ఆత॥)
మన్ననలు సతమైతే మాఁటలెల్లా నాడవలె
విన్నప మందకుండితే విడువవలె
సన్నకు లోఁగానివాని సాదించఁజూచితేను
కన్నవారెల్లా నెంత గబ్బి యిది యనరా
(॥ఆత॥)
మనసు చిమ్మిరేఁగితే మచ్చికతో నవ్వవలె
తనిసితే నివ్వెరగందఁగవలెనూ
యెనసిన శ్రీవేంకటేశుతోఁ బెనఁగితేను
వినినవారెల్లా నన్ను వేసాలది యనరా
(||pallavi||)
ādani sittamu vachchinade padivelugāga
sedulĕtti mŏkke nenu sittagiṁchumanave
(||āda||)
sĕllubaḍi galigide sĕnagi kŏsaravalĕ
vŏllane kŏṁkide nūraguṁḍavalĕnu
palladāna ramaṇuni balimi sesidenu
yĕllavārū nām̐ṭa dāni nĕṁta gayyāḽĕnarā
(||āda||)
mannanalu sadamaide mām̐ṭalĕllā nāḍavalĕ
vinnaba maṁdaguṁḍide viḍuvavalĕ
sannagu lom̐gānivāni sādiṁcham̐jūsidenu
kannavārĕllā nĕṁta gabbi yidi yanarā
(||āda||)
manasu simmirem̐gide machchigado navvavalĕ
taniside nivvĕragaṁdam̐gavalĕnū
yĕnasina śhrīveṁkaḍeśhudom̐ bĕnam̐gidenu
vininavārĕllā nannu vesāladi yanarā