ఆ మాఁట నాతో నీవు ఆనతిమ్మా
(॥పల్లవి॥)
ఆ మాఁట నాతో నీవు ఆనతిమ్మా
యీ మతకమింతా నీదా యేమోయి వోయి
(॥ఆమా॥)
పైకొని నిన్ను నేను పచ్చిగాఁ దిట్టితిననీ-
నాకెకుఁ దెలుపవోయి ఆసుద్ది
దాకొన్నమగఁడవంటాఁ దా నీకుఁ బూనుకవచ్చీ
చేకొని నీవే తనతోఁ జెప్పితివా వోయి
(॥ఆమా॥)
చేరి నీచేత సేవలు సేయించుకొంటిననీ
నారుకొన నీ వాపెను నమ్మించవోయి
యీరీతిఁ జుట్టమవంటా నిచ్చకములు నెరపీ
ఆరీతిని నీవే యిన్నీ నాడించవోయి
(॥ఆమా॥)
పక్కన నీపై నేను పాదాలు వేసితిననీ
పెక్కులాపెతో నానలు పెట్టుకోవోయి
ఇక్కువల శ్రీవేంకటేశ నన్ను నేలితివి
మొక్కీఁ దాను బావ వంటా మొరఁగులా వోయి
(||pallavi||)
ā mām̐ṭa nādo nīvu ānadimmā
yī madagamiṁtā nīdā yemoyi voyi
(||āmā||)
paigŏni ninnu nenu pachchigām̐ diṭṭidinanī-
nāgĕgum̐ dĕlubavoyi āsuddi
dāgŏnnamagam̐ḍavaṁṭām̐ dā nīgum̐ būnugavachchī
segŏni nīve tanadom̐ jĕppidivā voyi
(||āmā||)
seri nīseda sevalu seyiṁchugŏṁṭinanī
nārugŏna nī vābĕnu nammiṁchavoyi
yīrīdim̐ juṭṭamavaṁṭā nichchagamulu nĕrabī
ārīdini nīve yinnī nāḍiṁchavoyi
(||āmā||)
pakkana nībai nenu pādālu vesidinanī
pĕkkulābĕdo nānalu pĕṭṭugovoyi
ikkuvala śhrīveṁkaḍeśha nannu nelidivi
mŏkkīm̐ dānu bāva vaṁṭā mŏram̐gulā voyi